ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన..

128
kcr
- Advertisement -

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆదివారం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, పరిణామాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి, హోంశాఖ మంత్రులను కలిసిన కేసీఆర్, శనివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో భేటీ అయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని సీఎం కోరారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, నిధులు మంజూరుచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ఆరు విమానాశ్రయాలు, ఇతర అంశాలపై చర్చించారు.

- Advertisement -