దేశంలో కాంగ్రెస్ బలహీనమైపోయిందని అభిప్రాయపడింది శివసేన. ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బలంగా మారాల్సిన అవరసం ఉందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో స్పందించిన సంజయ్….పవార్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం శరద్ పవార్‌కు ఉందని తెలిపారు.రాజకీయాల్లో ఏదైన జరగొచ్చని…ఉహకందనివని అభిప్రాయపడ్డారు శివసేన ఎంపీ.
అయితే యుపీఏ ఛైర్మన్‌గా పవర్ ఎన్నిక కానున్నారనే వార్తలను ఎన్సీపీ ఖండించింది. యూపీఏ మిత్రుల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది.
ఇదిఇలా ఉంటే మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. సంకీర్ణ కూటమి ఏర్పాటు,శివసేనకు సీఎం పదవి దక్కడంలో కీరోల్ పోషించారు శరద్ పవార్.