- Advertisement -
టైమ్ మ్యాగ్జైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్-ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. టైమ్ తన కవర్ పేజీపై బైడెన్(78), హ్యారిస్(56) ఫొటోలను ‘చేంజింగ్ అమెరికాస్ స్టోరీ’ పేరిట ముద్రించనుంది.
ఈ రేసులో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో పోటీపడి గెలిచారు బైడెన్-కమలా. వార్తల్లో ఎక్కువగా నిలిచిన వ్యక్తులను టైమ్ మేగైజన్ 1927 నుంచి ప్రతి ఏటా సత్కరిస్తూ వస్తోంది. 2016లో ట్రంప్… పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా
నిలిచారు.
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించి విజయం సాధించగా ట్రంప్ 232 ఓట్లకే పరిమితం అయ్యారు. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్…తాజాగా ఎలక్టోరల్ ఓట్లపై సుప్రీంను ఆశ్రయించారు.
- Advertisement -