రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం పెద్ద అంబర్ పేట మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మున్సిపల్ కమీషనర్ పి. బలరాం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యతగా మనందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగిందని. మా మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రతి ఇంటి నందు మొక్కలు పెంచడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
రాజ్యసభ సభ్యులు సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రజలలో చాలా చైతన్యం తీసుకు వస్తుందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నరసింహారెడ్డి, శైలజ, సురేష్ కుమార్, అశోక్ కుమార్, హనుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.