- Advertisement -
కరోనాపై పోరులో వివిధ కంపెనీలు చేపడుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ సత్ఫలితాలనిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతుండగా అత్యవసర అనుమతి కోసం పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇక తాజాగా ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెన్‌కాతో కలిసి సంయుక్తంగా సీరం సంస్థ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాక్సిన్ ధర రూ. 250గా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఈమేరకు సీరం సంస్థ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది.
ఒక డోసు వ్యాక్సిన్ ధర సుమారు 3.39 డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అత్యవసరంగా తమ టీకాను వాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది.ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా కన్నా ముందుగా భారత్‌లో తమ టీకాను ఇవ్వనున్నట్లు ఆధార్‌పూనావాలా చెప్పారు.
- Advertisement -