మొక్కల పెంపకం ప్రతి పౌరుడి బాధ్యత అని ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. శుక్రవారం కాటారం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి, మొక్కలు నాటి, మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా సవాలు విసిరారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొక్కలను నాటడం వలన వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని, సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ అలం, వీర్దావల్ ఖడే, ఒలంపిక్ స్విమ్మర్, మహారాష్ట్ర డిప్యూటీ కలెక్టర్‌కు మరియు డిఎస్పి బోనాల కిషన్ పేర్లను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ కిషన్, సీఐ హతీరాం, ఎస్ఐ సాంబమూర్తి, కొయ్యూరు ఎస్ఐ సత్యనారాయణ, అడవి ముత్తారం ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.