పవర్ ఫుల్ టైటిల్‌తో బాలయ్య చిత్రం..

221
nbk
- Advertisement -

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రం బిబి 3 అంటున్నారు. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే మోనార్క్ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు బాలయ్య. అందులో ఒకటి కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటిస్తుండగా.. బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకు బలరామయ్య బరిలోకి దిగితే.. అనే పవర్ ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. పవర్ ఫుల్ స్టోరీతోనే బలరామయ్య బరిలోకి దిగుతున్నాడని తెలుస్తుంది.

- Advertisement -