- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. 56 స్ధానాలతో టీఆర్ఎస్ రెండోసారి బల్దియా పీఠాన్ని దక్కించుకోగా ఎక్స్‌అఫీషియో సభ్యులతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనుంది టీఆర్‌ఎస్.
అయితే చాలాచోట్ల టీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. మౌలాలీలో 200 ఓట్లు, మల్కాజ్‌గిరిలో 178 ఓట్లు, అడిక్మేట్‌లో 227 ఓట్లు, మూసాపేట్‌లో 538 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ ఓడిపోయింది.
అలాగే హస్తినాపురం 279, వినాయక నగర్ 287, రామ్ గోపాల్ పేట 310, రామ్ నగర్ 528, రామంతపూర్ 655, వనస్థలిపురం 702, జూబ్లీ హిల్స్ 779, మంగళ్ హట్ 809, సైదాబాద్ 911, గచ్చిబౌలి 1135, అమీర్ పేట్ 1301, హబ్సిగూడ 1447, కవాడిగూడలో 1477 ఓట్ల తేడాతో ఓటమి ఎదురైంది.
- Advertisement -