డిసెంబర్ 4తేదీ శుక్రవారం రోజున జిహెచ్ఎంసి ఓట్ల లెక్కింపు సందర్భంగా మల్కాజ్‌గిరిలో టిఆర్ఎస్ ఏజెంట్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఘన విజయం చేకూర్చేందుకు 20రోజుల పాటు కష్టించి పని చేసిన పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు విలువైనదే, ఎన్నికలలో చాలా కాలంగా ఇ.వి.ఎం లకు అలవాటు పడిన మనం, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి అన్నారు. దేశ ఎన్నికల చరిత్రలో ఒకటి, రెండు ఓట్లతో ఓటమి పాలైన వారెందరో ఉన్నారన్న విషయాన్ని మరువరాదన్నారు. ఎన్నికల వ్యవస్థలో ఓట్ల లెక్కింపునకు ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే.
4 తేదీ శుక్రవారం ఏజెంట్లు ఉదయం 7గంటల వరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్లు పూర్తిగా ఓట్ల లెక్కింపుపై దృష్టి పెట్టాలి. ఓపికతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.నేను ఎన్నో ఎన్నికలు చూసినా,ఓట్ల లెక్కింపు సందర్భంగా అశ్రద్ధ, నిర్లక్ష్యం అసలే వద్దు, చాలా శ్రద్ధాసక్తులు అవసరం. ఓట్ల లెక్కింపు పూర్తిగా ముగిసే వరకు, సంతకాలు చేసిన తర్వాతే కేంద్రాల నుంచి బయటకు రావాలని మంత్రి పార్టీ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు హనుమంత రావు, ఆయా డివిజన్ అభ్యర్థులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.