పెద్ద నోట్ల రద్దుతో దేశం అతలకుతలమైన సంగతి అందరికీ తెలిసిందే. 2016 నవంబర్8తారీఖును భారతీయులు ఎవ్వరూ మరచిపోలేరు! ఎందుకంటే చెలామణిలో ఉన్న రూ. 500 – రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మోడీ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసే వరకు కనీసం కేంద్ర మంత్రులకు కూడా తెలియకుండా చూశారు మోడీ. దేశంలో జరుగుతున్న అవీనితికి చెక్‌పెట్లేందుకే నోట్లరద్దు చేసినట్లు మోడీ తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంటే త్వరలో రెండువేయ్యిల రూపాయిలు నోటు రద్దవుతుందని ఓ అధికారి చెబుతున్నాడు.
ఇటీవలే తమిళనాడులోని తిరుచ్చిలో అభ్యుదయ రచయితల సంఘం నెలసరి సమావేశం జరిగింది. అ కార్యక్రమానికి భారత స్టేట్ బ్యాంకు అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్ ఫ్రాంకో హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్చిలోగా రూ.2వేల నోటు చెల్లదంటూ ఆర్బీఐ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నట్లు తెలిపారు. బాస్టన్ అనే ప్రైవేటు సంస్థ నివేదిక ప్రకారం రెండు వేయ్యిల రూపాల నోట్లను రద్దుచేసేల కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని థామస్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు ఇందులో ఎలాంటి రహస్యం లేదని…. నోట్లు రద్దవుతున్నట్లు దనవంతులకు ముందుగానే తెలిసిందని థామస్ ఫ్రాంకో పేర్కొన్నారు. రద్దు కారణంగా 25 శాతం చిన్న తరహా పరిశ్రమల కార్మికులు ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ కేంద్ర భద్రతా కార్మికశాఖ సంఘాలు దేశవ్యాప్తంగా ఈనెల 28న ఆందోళన, 31న మానవహార ప్రదర్శనలు జరుపనున్నట్లు పేర్కొన్నారు.
చివరగా మాట్లాడుతూ…మార్చి 31లోగా రెండు వేల రూపాయల నోటు కూడా చెల్లదంటూ ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిని సంపూర్ణంగా కోల్పోయిందని అన్నారు.