- Advertisement -
అభివృద్ధి కోసమే నోముల నరసింహయ్య టీఆర్ఎస్లో చేరారని తెలిపారు నోముల కుమారుడు భగత్. సోషల్ మీడియాలో నోముల వాయిస్‌తో జరుగుతున్న దుష్ప్రచరాన్ని ఖండించిన ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 34 సంవత్సరాల పాటు సీపీఎంలో పనిచేసిన నోముల…అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. నాగార్జున సాగర్ నుండి 2014లో ఓడిపోయినా రెండోసారి అవకాశం ఇచ్చిన గొప్పనేత సీఎం కేసీఆర్ అని పలుమార్లు నోముల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన కుమారుడు. తన తండ్రి పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు.
2014లో నాగార్జున సాగర్ నుంచి పోటి చేసి ఓటమి చెందినా… 2018లో రాష్ట్రస్థాయిలో బలమైన నాయకుడిగా పేరొందిన జానారెడ్డిపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇక నోముల అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సీఎం కేసీఆర్ నోముల అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది.
- Advertisement -