డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ నేతలు

168
bjp
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ బీజేపీ నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. హయత్‌నగర్‌ డివిజన్‌లోని బంజారకాలనీలో నిన్న అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆ పార్టీ సీనియర్‌ నేత ఘంటా ప్రభాకర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.

డబ్బులు పంచుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డితో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 50 వేల నగదుతో పాటు రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.

సరూర్‌నగర్‌ డివిజన్‌లోనూ బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆకుల శ్రీవాణి భర్త అంజన్‌ బీజేపీ నేతలతో కలిసి సరూర్‌నగర్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌లో ఎలక్షన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓట్లరు డబ్బులు పంచారు. దీంతో టీఆర్ఎస్ – బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతవరణం నెలకొంది.

- Advertisement -