అమీర్ ఖాన్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్‌..

201
Lakshmi Manchu
- Advertisement -

నట ప్రపూర్ణ మోహన్ బాబు తనయగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ఈమె సినిమాలు, టాక్ షోలు, ప్రొడక్షన్… ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్ రంగంలోనూ సందడి చేస్తున్న మోహన్ బాబు తనయ తాజాగా ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అంటే విపరీతమైన క్రష్ అని తెలిపారు. బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ను ఎంతో ఇష్టపడేదాన్నని, కుదిరితే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండేదని వెల్లడించారు.

కానీ తన ప్రేమ తనలోనే ఉండిపోయిందని, అతనితో చెప్పలేకపోయానని వాపోయారు. అయితే… ఆమీర్ ఖాన్ మొదటిసారి పెళ్లి చేసుకున్నపుడే కాదు.. రెండోసారి మ్యారేజ్ చేసుకున్నపుడు కూడా మంచు లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదట. అంతలా ఆమీర్ ఖాన్ పై క్రష్ ఉండేదని మంచు లక్ష్మి వెల్లడించింది. మంచు లక్ష్మి ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త ఆండీ శ్రీనివాస్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

- Advertisement -