2017 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఎన్సీపీ నేత శరద్ పవార్, బీజేపీ నేత మరళీ మనోహర్ జోషి, లెజండరీ సింగర్ కేజే ఏసుదాస్ లకు భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. వీరితో పాటు దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్, పీఏ సంగ్మా, సుందర్ లాల్ పత్వాలకు మరణానంతరం పద్మ విభూషణ్ లను కేంద్రం ప్రకటించింది.
20 మందిని పద్మ శ్రీతో సత్కరించింది కేంద్రం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, మరియప్పన్, దీపా కర్మాకర్,నరేంద్ర కోహ్లీ,కైలాష్ ఖేర్, సాధు మెహర్, సంజయ్ కపూర్, టి.కె. విశ్వనాథన్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్,కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షిఅమ్మకు పద్మ శ్రీ అవార్డులు లభించాయి. ఎయిడ్స్ పై రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ సునితీ సాలమన్, సినీ విమర్శకుడు భావనా సోమయ్య, గాయని అనురాధా పౌడ్వాల్ లకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
లక్ష్మీఆసు యంత్రం సృష్టికర్త యాదాద్రి జిల్లా ఆలేరుకి చెందిన చింతకింది మల్లేషంకు పద్మ శ్రీ అవార్డు వరించింది. కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు సైతం పద్మ శ్రీ అవార్డు దక్కింది. ఈ సంవత్సరం భారతరత్న అవార్డును ఎవరికీ ప్రకటించలేదు.రియో ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధూ పేరు లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.