ఓటమి అంగీకరించిన ట్రంప్‌…

237
trump
- Advertisement -

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెన‌క్కి త‌గ్గారు. కొత్తగా దేశాద్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు అధికారి బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ‌లో స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.306 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ విజయం సాధించగా ట్రంప్ కోర్టు మెట్లెక్కి అడ్డంకులు సృష్టించే ప్రయత్రం చేశారు. అయితే కోర్టులో కూడా ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. తాజా ఎన్నిక‌ల్లో బైడెన్ గెలిచిన‌ట్లు గుర్తించామ‌ని జ‌న‌ర‌ల్ స‌ర్వీసెస్ అడ్మినిస్ట్రేష‌న్‌(జీఎస్ఏ) పేర్కొనడంతో ట్రంప్ వెనక్కి తగ్గారు.

అధికార బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డం ప‌ట్ల బైడెన్ బృందం వెల్క‌మ్ చెప్పింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 20వ తేదీన అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. అధికార బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ చేప‌ట్టే జీఎస్ఏ బైడెన్ బృందంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.

- Advertisement -