ఇవి మెగా ఫేక్ కలెక్షన్లట..!

173
Khaidi No 150 Box-Office reports are FAKE
- Advertisement -

ఖైదీ కలెక్షన్లు ఫేక్ అంటూ.. సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఖైదీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి చెప్పారు. అయితే రెండవ రోజు కలెక్షన్స్ పై మాత్రం ఎవ్వరూ పెదవి విప్పలేదు. అసలు విషయం ఏంటంటే..సెకండ్ డే నుంచే..ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయట. ఖైదీ కలెక్షన్లపై వస్తున్న వార్తలపైనందమూరి అభిమానులు మొదటి నుంచి ఓ కన్నేసి ఉంచారట.

అంతేకాదు ప్రముఖ పీఆర్ఓ, ఇండస్ట్రీ హిట్ అధినేత బిఎ రాజు చెప్పిన విషయాలు కూడా ఇదే విషయాన్నిధృవీకరిస్తున్నాయి. వైజాగ్ లో తోలి రోజు 156 ఉన్న ఖైదీ థియేటర్ల సంఖ్య రెండవ రోజు చేరుకునే సమయానికి 97కు పడిపోయిందట.స్క్రీన్లు తగ్గడంతో కలెక్షన్లపై ప్రభావం ఆటోమేటిగ్ గా ప్రభావం పడిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ వెంటనే బీఏ రాజు ట్వీట్ ను తొలగించడం ఆసక్తికరంగా మారింది.

రెండు పెద్ద సినిమాల కలెక్షన్స్ ను పోస్ట్ చేయగా, కేవలం ఖైదీ నంబర్ 150 కి సంబంధించిన కలెక్షన్స్ ను మాత్రమే ఎందుకు తొలగించారు? దీని వెనుక ఉన్న మర్మమేమిటి? అంటూ నందమూరి అభిమానులు అసలు విషయాలను పరిశోధించే పనిలో పడ్డారు. అంతేకాదు బీఏ రాజు లెక్కల ప్రకారం.. కలెక్షన్ల విషయంలో చాలా తేడాలున్నాయి. దీంతో ఫేక్ మెగా కలెక్షన్స్ అంటూ నాన్ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరీ, ఈ కలెక్షన్ల వెనక ఉన్న మతలబేంటో దేవుడికే తెలియాలి.

- Advertisement -