మొక్కలు నాటిన బోయినిపల్లి జెడ్పీటిసి దంపతులు..

224
Boinipally zptc
- Advertisement -

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండల జెడ్పీటిసి శ్రీమతి కత్తెర పాక ఉమాకొండయ్య ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వస్థలం కొదురుపాకలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బోయినిపల్లి జెడ్పీటిసి మాట్లాడుతూ.. రోజు ఏ గ్రామంలో ఏ వీధిలో చూసినా కూడా ఇరువైపుల మొక్కలు కనబడుతున్నాయి అంటే దీనికి కారణం కెసిఆర్ మానస పుత్రిక అయినా తెలంగాణకి హరితహారం కార్యక్రమం.

దీనికి కొనసాగింపుగా రాజ్యసభ సభ్యుడు జోగిని పెళ్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించబడింది. ప్రతిరోజు దేశంలో ఎంతోమంది వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలను చైతన్య పరచడం చూస్తున్నాము. దీనికంతటికీ కారణం ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాత్రమే. అందరం మొక్కలు నాటుదాం. అంతేకాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి బోయినిపల్లి జెడ్పీటిసి తెలిపారు.

- Advertisement -