బిహార్…కీలక పదవులన్ని బీజేపీకే!

165
bihar
- Advertisement -

బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీశ్ కుమార్‌. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా జేడీయూ-బీజేపీ మధ్య పదవుల పంపకం కొలిక్కివచ్చింది.

రెండు ఉపముఖ్యమంత్రి పదవులు, స్పీకర్‌ పదవి సహా మంత్రివర్గంలోని కీలక శాఖలన్నీ బీజేపీకే దక్కనున్నాయి. బీజేపీ శాసనసభా పక్షనేత తర్కిషోర్‌ ప్రసాద్‌, రేణూ దేవీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనుండగా గత 15 ఏళ్లుగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ మోదీకి ఈసారి ఆ పదవి దక్కలేదు.

రేణూ దేవి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఎన్డీయే కూటమి 125 సీట్లు గెలుపొందగా ఇందులో బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించి కూటమిలో అతిపెద్దపార్టీగా అవతరించింది. జేడీయూ కేవలం 40 స్థానాలకే పరిమితమయ్యింది.

- Advertisement -