బిగ్బాస్ 4 తెలుగు విజయవంతంగా 68 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 68వ ఎపిసోడ్లో ఇంట్లోని సభ్యులు ఇప్పటివరకు ఎవరు చెప్పని రహాస్యాలను వెల్లడించాలని అందుకు ప్రతిఫలంగా వారికి వారు ఆప్తుల నుండి లెటర్స్ వస్తాయని తెలిపారు.
అమ్మ దగ్గర దాచిన ఏకైక రహస్యం ఇది. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా అంటూ తెలిపింది హారిక. ఇంటికి ఎవరు వచ్చిన హారికను చూసి నేర్చుకోండి… లవ్వుల జోలికే వెళ్లదు అని నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్పేదానివి. సారీ అమ్మా.. నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది అని చెప్పుకొచ్చింది.
ఇక హారిక బ్రేకప్ లవ్ స్టోరీ నచ్చడంతో అఖిల్ సీక్రెట్ రూం నుంచి హారిక తల్లి, అన్నయ్య పంపించిన లేఖను హౌస్లోకి పంపాడు. హాయ్ పండూ నేను ఎప్పుడూ గర్వపడేలాగే చేస్తావూ…..అవమానాలను గెలుపుగా మార్చుకున్నావు తల్లీ అంటూ ఆమె అన్నయ్య రాసిన ఒక్కో వాక్యం చదువుతూ కన్నీటి పర్యంతం అయ్యింది.