మార్కెట్ అధ్యయనంతో నియంత్రిత సాగు అమలు చేస్తోందని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ వానాకాలం కోటి 45 లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు చేస్తున్నామని… 60 లక్షల ఎకరాలలో పత్తి సాగు, 53 లక్షల ఎకరాలలో వరి, 12 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని తెలిపారు.
పత్తి సాగుకు అలంపూరు ప్రసిద్ధి…. ఎన్ని మార్పులు జరిగినా, ఎంత శాస్త్ర సాంకేతికత పెరిగినా ఆహారం భూమి నుండి రావాల్సిందేనని చెప్పారు. దానిని రైతు పండియ్యాల్సిందే .. దీనికి ప్రత్యామ్నాయం లేదు అందుకే కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
రైతు బాగుండాలని అనేక పథకాలు ప్రవేశపెట్టారు… ఆహార పద్దతులు, వండే వంటలో మార్పులు రావచ్చు అన్నారు. కానీ పండించే పంటకు భూమే ఆధారం…. అలంపూరు నియోజకవర్గం నారాయణపురం, మద్దూరు, కలుగొట్ల రైతువేదికలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్మన్ సరిత పాల్గొన్నారు.