ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ నేడు తన జన్మదినం సందర్బంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో కోటపల్లి గ్రామంలో ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంతోష్.. చొరవ వల్ల మొక్కలు నాటడం పైన ప్రాధాన్యత పెరిగిందని,ప్రతి శుభ కార్యలకు మొక్కలు నాటే ఆనవాయితీ మొదలైందని, నాటిన మొక్కలు ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని, అడవుల సంరక్షణ పైన కేసీఆర్ ఉక్కు పాదం మోపారని, వనసంరక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అనిఅన్నారు.
ఒకప్పుడు చెన్నూర్ దగ్గర ఉండే అర్జున గుట్ట కలప వ్యాపారానికి అడ్డాగా ఉండేదని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో అసువులు పూర్తిగా సంరక్షించబడుతున్నాయని తెలిపారు. దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతూ ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని, ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.