తెలంగాణ కరోనా వైరస్ అప్‌డేట్..

121
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 51 వేలు దాటాయి. గత 24 గంటల్లో 857 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,51,188 దాటాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 19,239 యాక్టివ్ కేసులుండగా 16,449 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనాతో ఇప్పటివరకు 1504 మంది మృతి చెందగా 2,30,568 రికవరీ అయ్యారు.

కరోనా మరణాల శాతం దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి తగ్గిందని.. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 92.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.79 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 46,42,276 కరోనా టెస్టులు నిర్వహించారు.

- Advertisement -