డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అడిగారు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. డబల్ డెక్కర్లను రోడ్లపైకి మళ్లీ తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై టీఎస్ ఆర్టీసీ ఎండీతో మాట్లాడుతానంటూ కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు మంత్రి పువ్వాడ అజయ్.
డబల్ డెక్కర్లపై ఓ ఔత్సాహికుడి ట్వీట్ కు మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు డబల్ డెక్కర్‌లో వెళ్లిన రోజులను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై సంచరించే డబల్ డెక్కర్ బస్సులను ఎందుకు నిలిపివేశారో అర్థంకాలేదంటూ కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. డబల్ డెక్కర్లను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.