డేటా సెంటర్ల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్ధానం: కేటీఆర్

203
ktr minister
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవతో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చింది అమెజాన్ వెబ్ సర్వీసేస్.

అమెజాన్ భారీ పెట్టుబడిని స్వాగతించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని…. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని తెలిపారు. తెలంగాణ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటన లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు కేటీఆర్.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది అమెజాన్. హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటుచేయనుంది. 2022 సంవత్సర ప్రథామార్దం లో కార్యకలాపాలు ప్రారంభించనుంది అమెజాన్ వెబ్ సర్వీసెస్.

- Advertisement -