25 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్…

225
josef biden
- Advertisement -

హోరాహోరిగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేలు ఉహించినట్లుగానే ట్రంప్‌పై బైడెన్‌ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్ నాలుగు రాష్ట్రాల్లో విజ‌యం సాధించ‌గా, బైడెన్ ఐదు రాష్ట్రాల్లో గెలుపొందారు. మ‌రో నాలుగు రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా, సౌత్ క‌రోలైనా రాష్ట్రాల్లో గెలుపొందగా వ‌ర్జీనియా, వెర్మాంట్‌, మేరిల్యాండ్, న్యూజెర్సీ, మ‌సాచుసెట్స్ రాష్ట్రాల్లో బైడెన్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అదేవిధంగా టెక్నాస్‌, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంషైర్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధ్యిక్యంలో కొన‌సాగుతున్నారు. ఇక 25 రాష్ట్రాలో పోలింగ్ ముగిసే సరికి 27,021,444 ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉన్నాడు. అయితే జో బెడెన్ కూడా 26,569,715 ఓట్లతో ఉన్నారు.

దేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్య‌క్షప‌ద‌విని సొంతం చేసుకోనున్నారు.అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదైంది.

- Advertisement -