అల్లరి నరేష్ పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్ర పోషిస్తున్న చిత్రం నాంది. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన పోష్టర్ను విడుదల చేసింది.
ఈ పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిల్చొని తన బాధను వ్యక్త పరుస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది అల్లరి నరేష్ నాంది సినిమాలో ఇప్పటివరకు చెయ్యని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నాడని. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన నాంది పోస్టర్ (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్)కు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
తారాగణం:అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు.
సాంకేతిక వర్గం:
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సతీష్ వేగేశ్న
లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా
సినిమాటోగ్రఫీ: సిద్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ: తూమ్ వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
స్టిల్స్: ప్రశాంత్ మాగంటి
కో.డైరెక్టర్: బురుగుపల్లి సత్యనారాయణ