కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డ మంత్రి హరీష్..

156
minister harish rao
- Advertisement -

దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ , బీజేపీ లవి మార్ఫింగ్, ఫేకింగ్ సోషల్ ప్రచారం. బిజేపీ అంటే..భారతీయ జనతా పార్టీ కాదు.. భారతీయ ఝటా పార్టీ అని మండిపడ్డారు. బిజేపీ సోషల్ మీడియా పుకార్ల పుట్ట…అబద్ధాల గుట్ట. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు.. బిజెపి అంటే బాయికాడా మోటార్లకు మీటర్లు పెట్టే పార్టీ.. టీఆర్ఎస్ అంటే కడుపు నిండా ప్రజలను చూసుకునేదని మంత్రి అన్నారు.

60 , 70 ఏళ్లలో గ్రామాల్లో జరగని పనులు.. 6 ఏళ్లలో గ్రామాల రూపు రేఖలు మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. పల్లెలన్ని గాంధీజి కలలు కన్న స్వరాజ్యం కావాలని సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారు. గ్రామాల్లో మార్పు దిశగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ దామాలు, డంప్ యార్డ్‌లు, పల్లెలు పచ్చదనంగా ఉండేందుకు నర్సరీలు ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు వందలాది చెరువుల కట్టలు తెగిపోయాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి స్వచ్చమైన త్రాగునీరు ఇస్తున్నామో, మారుమూల గ్రామల ప్రజలకు అదే విధంగా త్రాగునీరు ఇస్తున్నాం.

కాళేశ్వరం ద్వారా ఎక్కువగా లబ్ది పొందే ప్రాంతం దుబ్బాక ప్రాంతం. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి త్రాగు నీరు ఎలా ఇస్తున్నామో..ప్రతి పంట పొలాల వాకిట సాగు నీరు ఇస్తాం. అబద్ధపు ప్రచారాలు చేస్తూ బీజేపీ లబ్ది పొందాలని చూస్తోంది. దుబ్బాక అభివృద్ధికి నేను, ఎంపీ ఇద్దరం కుడి ఎడమలా ఉండి అభివృద్ది చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు.. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని మంత్రి తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తుంది. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్.. సీఎం కేసీఆర్. గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఈ కాంగ్రెస్, బీజేపీ ఝటా పార్టీలు ఎన్నికల్లో మాయ మాటలు చెపుతారు.. ఓట్లు కాగానే మల్ల కనపడరు. ఎప్పుడు.. ఎల్లప్పుడూ మీ కష్ట సుఖాల్లో ఉండేది గులాబీ జెండా అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -