- Advertisement -
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, రష్యాలు మురికి దేశాలని అన్నారు. బైడెన్‌తో మూడో డిబెట్ సందర్భంగా వాతావరణ మార్పుల అంశంలో భారత్, చైనా లాంటి దేశాలు సహకారం అందించలేదన్నారు.
చైనా,రష్యా, ఇండియాను చూడండి.. ఆ దేశాల్లో వాయు నాణ్యత చెడిపోయిందన్నారు. దాని వల్లే పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడి మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోలేనని, వేలాది కంపెనీలను మూసివేయలేమని ఆయన అన్నారు.
వాయు నాణ్యతపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. ప్రధాని మోదీ స్నేహితుడు ట్రంప్ భారత్ గురించి చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు స్పందించాలన్నారు.
- Advertisement -