తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు.నాయిని అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. ఆ తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు నాయిని పాడె మోసి నివాళులర్పించారు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందారు.