సీఎంఆర్‌ఎఫ్‌కు వీఐటీ యూనివర్సిటీ కోటి విరాళం

72
cmrf

వరదలతో అతలాకుతలం అయిన తెలంగాణా రాష్ట్రాన్ని ఆదుకోవటానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (వి.ఐ.టి.) విశ్వ విద్యాలయం ఈ గురువారం తెలంగాణా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించింది.

ఈ సందర్భంగా వి.ఐ.టి. విశ్వవిద్యాలయ ఫౌండర్ & ఛాన్సలర్ డా.జి.విశ్వనాథన్ మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితులలో తెలంగాణా రాష్ట్రాన్ని ఆదుకోవటానికి, వారికి పునరావాస మరియు సహాయక చర్యలకు అండగా నిలవటానికి వి.ఐ.టి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణా రాష్ట్రములో తిరిగి సాదారణ పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు.

ఈ కోటి రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. సి.యల్.వి. శివకుమార్ , తెలంగాణా రాష్ట్ర పురపాలక, ఐ.టి. మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు కు అందించటం జరిగింది