అలుపెరగని కార్మికనేత నాయని ఇకలేరు..

242
naini
- Advertisement -

తెలంగాణ తొలి హోంమంత్రి,కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి(86) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం 12.25 గంటలకు మృతిచెందారు. 28న కరోనాతో బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉండటంతో దవాఖానకు తరలించారు.అప్పటినుండి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తుండగా బుధవారం పరిస్ధితి మరింత విషమించడంతో మృతిచెందారు.

1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్‌,అహ్మదాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల్లో పలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రైల్వేచరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ రైల్వే బంద్‌ను జయప్రదం చేయడంలో కీలకంగా వ్యహరించారు.

1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు.

- Advertisement -