గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మనం ఫౌండేషన్ అధినేత..

207
RS kumar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మనం ఫౌండేషన్ నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదవ వసంతంలోకి అడుగు పెట్టిన శుభసందర్భంలో యప్రాల్ మనం నివాసంలో మనం ఫౌండేషన్ ఆర్.ఎస్ కుమార్ నేడు మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకొని మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను ఇస్తున్నాయని, కాబట్టి రోజు రోజుకి తగ్గిపోతున్న ఆక్సిజన్ పెంచడం కోసం అందరం బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నాటిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు మరియు మనం శ్రేయోభిలాషులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -