- Advertisement -
భారీ వర్షాలతో శ్రీశైలానికి ఎగువ నుంచి భారీగా వరదనీరు పొటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండటంతో భారీగా వరద వస్తోంది. ఇన్ ఫ్లో 6,53,302 క్యూసెక్కులు ఉండటంతో 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి దిగువ స్పిల్ వే ద్వారా 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 882.3 అడుగులు ( 211.47 టీఎంసీలు)గా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో ఇంజినీర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
- Advertisement -