అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి @ 24

836
pawan
- Advertisement -

అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈసినిమాతో మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే సినిమాలో కథానాయికగా పరిచయమైంది అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు యార్లగడ్డ సుప్రియ. సరిగ్గా 1996లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.

ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాలూరి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రచించగా పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

లవ్ స్టోరీ,యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ తన రియల్ స్టంట్‌లతో ప్రేక్షకులను మెప్పించాడు. తొలి సినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పవన్‌…సరిగ్గా ఇండస్ట్రీలోకి ఎంటరై నేటికి 24 ఏళ్లు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి వకీల్ సాబ్ వరకు పవన్‌ జర్నీ ఆధ్యంతం ఆసక్తికరం. తీసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్‌లో ఏ హీరోకు దక్కని క్రేజ్ పవన్ సొంతం. పవర్‌స్టార్ పవనిజం మేనియాతో ఇప్పటికి యూత్ ఫిదా అయిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. పవన్ తొలి మూవీ విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్‌ విషెస్ తెలియజేస్తున్నారు.

- Advertisement -