కేటీఆర్ ఫూట్ బాల్ ఛాంపియన్ షిప్‌ను ప్రారంభించిన మంత్రి..

267
Srinivas Goud
- Advertisement -

హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్‌లోని SCF ఫూట్ బాల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మొదటి కేటీఆర్ ఫూట్ బాల్ ఛాంపియన్ షిప్ -2020 టౌర్నమెంట్‌ను శనివారం రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్‌తో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్‌గా రూపొందిస్తున్నామన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో 2 శాతం,ఉన్నత విద్యా అభ్యసించే వారికి ఫ్రొఫెషనల్ కోర్సుల్లో 0.5 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపొందించటానికి క్రీడా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. క్రీడా పాలసీ రూపకల్పనకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని మంత్రి వెల్లడించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఫూట్ బాల్ క్రీడా అభివృద్ధికి రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేరుతో ఫూట్ బాల్ టౌర్నమెంట్‌ను నేటి నుండి (10.10.2020 to 12.10.2020) ఈ నెల12 వరకు రెండు రోజుల పాటు భద్రుద్దీన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారన్నారు. ఈ టౌర్నమెంట్‌లో 14 ఫూట్ బాల్ జట్లు పాల్గొంటాయన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఈ టౌర్నమెంట్ ను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -