- Advertisement -
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడుపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న “బతుకమ్మ చీరల పంపిణీ” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. దీంతో తెలంగాణలో ఊరూరా బతుకమ్మ చీరల సందడి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్వయంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికీ తిరిగి చీరల పంపిణీ చేశారు. అలాగే కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్,నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి,ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్,వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్,మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
- Advertisement -