బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 31 హైలైట్స్‌

313
mukku avinash
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 విజయవంతంగా 31 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా సోమవారం జరిగన ఎలిమినేషన్ ప్రక్రియపై సభ్యులు చర్చజరిపారు. దివి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుని లాస్య కంటతడి పెట్టగా అభి,అఖిల్ …మొనాల్‌ను ఓదార్చే పనిలో బిజీగా ఉండటం,మిగితా సభ్యులు ఎవరినైతే ఎలిమినేట్ చేశామో వారి దగ్గరికి వెళ్లి సారి చెప్పడం, బీబీ హోటల్ టాస్క్‌ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

తొలుత దివి మాటలను గుర్తు చేసుకుని లాస్య ఏడుస్తూ కనిపించగా గంగవ్వ ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పింది. ఇక మోనాల్ కూడా వాష్ రూం దగ్గరకు వెళ్లి బోరు బోరున ఏడ్వడంతో అభిజిత్ వచ్చి ఇదంతా నావల్లే అయ్యింది అంటూ మోనాల్ కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఏడుస్తూనే అక్కడినుండి వెళ్లిపోయింది మొనాల్.

బయట నోయల్ కోసం చర్చించుకున్నారు రాజశేఖర్ మాస్టర్, సొహైల్, కుమార్ సాయిలు. గ్రూప్‌లు ఫామ్ చేసి తనకు నచ్చినట్టు చేస్తున్నాడని..నామినేషన్‌లో అమ్మాయి ఉంటే ఒకలా.. వేరే వాళ్లు ఉంటే ఒకలా చేస్తున్నాడని మాట్లాడగా తనని నామినేట్ చేసి మోసం చేశాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు మాస్టర్‌. అర్థరాత్రి 12 గంటలకు అఖిల్-మోనాల్‌లు ఎప్పటిలాగే ముచ్చట్లు పెట్టారు. అభిజిత్ తనతో అన్న మాటలను అఖిల్ చెప్పగా తెగబాధపడిపోయింది మొనాల్.

అమ్మ రాజశేఖర్ బాధపడుతుండటంతో ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు నోయల్‌. ఆమెతో ఫ్రెండ్‌గా ఉంటానని చెప్పా కానీ మీరు ఆమెను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అంటూ కథ చెప్పడంతో.. నీ కథలు నా దగ్గర చెప్పకు నోయల్.. పోయి చిన్న పిల్లల దగ్గర చెప్పుకో అంటూ కంటతడి పెట్టాడు మాస్టర్‌. అబ్బాయి కోసం నువ్ చేస్తే బాగుండేది.. అమ్మాయి కోసం ఇలా చేస్తావా?? అమ్మా రాజశేఖర్‌ని బయటకు పంపాలని ప్లాన్ చేశావ్ ఇప్పుడు కథలు అల్లుతున్నావ్ వద్దురా నువ్ పో అని గట్టిగానే చెప్పారు రాజశేఖర్ మాస్టర్.

తర్వాత అవినాష్‌ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచిన బిగ్ బాస్‌ ….బిబి గ్రాండ్ హోటల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగే ఈ బిబి గ్రాండ్ హోటల్‌ టాస్క్‌లో భాగంగా అతిథులు-హోటల్ స్టాఫ్‌గా రెండు టీంలుగా ఉండటం,అతిథులు హోటల్‌కి రావడం,హోటల్ స్టాఫ్ వారికి సేవలు చేసి ఫైవ్ స్టార్ సంపాదించాలని తెలిపారు. అయితే ఇందులో ఓ ఫిటింగ్ పెట్టారు బిగ్ బాస్‌. అవినాష్ హోటల్ స్టాఫ్‌లో ఉన్నప్పటికి అతిథుల టీం తరపున ఆడాలని అతని కర్తవ్యం హోటల్ స్టాఫ్ ఛాలెంజ్‌లను, సర్వీసులను పాడు చేయాలని…ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ టాస్క్‌లో విజయవంతం అయితే కెప్టెన్ పోటీదారుడిగా ఉంటావని తెలిపారు.

హోటల్ స్టాఫ్‌లో అభిజిత్ (మేనేజర్), అఖిల్ (సెక్యురిటీ), సుజాత, లాస్యలు చెఫ్, అమ్మా రాజశేఖర్ అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిటర్, నోయల్ అండ్ కుమార్ హౌస్ కీపింగ్, మోనాల్ అండ్ దివి సర్వీస్ స్పా. అవినాష్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉంటారు. ఇక గెస్ట్ టీంలో మెహబూబ్, సొహైల్, హారిక (రిచ్ మెన్) క్వీన్ మదర్ (గంగవ్వ), ప్రిన్సెస్‌గా అరియానా ఉంటుందని తెలిపారు. గేమ్ స్టార్ట్ కాగానే ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్లు తెగ జీవించేశారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హోటల్ టీం సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తే దానిని చెడగొట్టే పనిలో బిజీగా ఉన్నాడు అవినాష్‌. అయితే బీబీ హోటల్ టాస్క్‌ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

- Advertisement -