శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ సమావేశం..

82
kcr

రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇవాళ సమావేశం నిర్వహించున్నారు సీఎం కేసీఆర్. బుధవారం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరుకానున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.