బెంగళూరు మరో విజయం

180
rcb
- Advertisement -

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాజా ఐపీఎల్ సీజన్ లో మరో విజయం నమోదు చేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించింది. అంతకుముందు, రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ లొమ్రోర్ 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు.. రాయల్స్ విసిరిన 155 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరోసారి తన ట్రేడ్ మార్కు ఇన్నింగ్స్ తో అలరించాడు. ఈ ఎడంచేతివాటం ఆటగాడు 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 63 పరుగులు సాధించాడు. ఆరోన్ ఫించ్ (8) విఫలమైనా కెప్టెన్ కోహ్లీ ఎంతో సంమయనంతో ఆడి జట్టుకు విజయం అందించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా రాణించాడు. ఏబీ డివిల్లీర్స్ 12 పరుగులతో అజేయంగా మిగిలాడు.

- Advertisement -