‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై రాజమౌళి క్లారిటీ..

135
SS Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – అలియా భట్ కూడా నటిస్తున్నారు.

రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు.”కరోనా ముందు నేను రిలీజ్ డేట్ చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం. కొన్ని పద్ధతుల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. అలా చేస్తున్నప్పుడు అనుకున్న సమయంలోనే షూటింగ్ చేస్తున్నానా అనేది చూసుకోవాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఆ రెండు నెలలు షూటింగ్ అనుకున్నట్లు జరుగుతుందా లేదా అని చూసుకోవాలి. తర్వాతే రిలీజ్ డేట్ పై ఐడియా వస్తుంది” అని జక్కన్న చెప్పారు.