పాయల్ ఆరోపణలు పచ్చి అబద్ధం- అనురాగ్ కశ్యప్

173
Anurag Kashyap
- Advertisement -

ఇటీవల హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ను నిన్న పోలీసులు విచారించారు. తాజాగా ఈ వ్యవహారంపై అనురాగ్ ఒక ప్రకటన చేశారు. పాయల్‌ మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని అన్నారు.

అనురాగ్ తరపున లాయర్ ప్రియాంక ఖిమానీ మాట్లాడుతూ… కశ్యప్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కశ్యప్ ఖండించారని చెప్పారు. విచారణ సందర్భంగా కశ్యప్ ఒక డాక్యుమెంటరీ ఆధారాన్ని అందించారని చెప్పారు. 2013 ఆగస్ట్ మాసం మొత్తం ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలోనే ఉన్నట్టు ఆధారాలు ఇచ్చారని తెలిపారు. మరి ఈ విషయంపై పాయల్ ఏం మాట్లాడుతుందో వేచిచూడాలి.

- Advertisement -