రాజ్యసభ సభ్యులు ఎంపీ &టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అక్బర్ సిఎఫ్ఓ వరంగల్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి తన కార్యాలయం లో మూడు మొక్కలు కొండా మామిడి , సీతాఫల్ మరియు జువ్వి మొక్కలు నాటారు భూపాలపల్లి డిఎఫ్వో కె పురుషోత్తం.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు ప్రస్తుతం అడవుల శాతం 28% మన లక్ష్యం 33శాతం,ఈ లక్ష్యం పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు హరితహారం కార్యక్రమం చేపట్టారు… దీనికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి సబడ్డ వర్గాల ప్రజానీకాన్ని ఏకతాటి మీదకి తీసుకువచ్చి మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమాల కొనసాగిస్తున్నారు.
ఈ మహా ఉద్యమంలో నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది మొక్కలు పెంచడం వలన ప్రయోజనాలు ,పర్యావరణం పరిరక్షణ పైన, వాటి ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీం మరియు ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ& టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే విజవంతంగా కొనసాగాలని నేను మరో ముగ్గురు శ్రీ రవి ప్రసాద్ డీఎఫ్ఓ పెద్దపల్లి , వంట రెడ్డి ఎఫ్డిఓ మహాదేవాపూర్ , కృష్ణమాచార్య ఎఫ్ డి ఓ మహబూబాబాద్ గార్లకు ఛాలెంజ్ చేశారు.