హైదరాబాద్‌లో ‘అల్లుడు అదుర్స్’

211
bellamkonda srinivas

‘రాక్ష‌సుడు’ చిత్రంతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్, ‘కందిరీగ’ ఫేమ్ డైరెక్ట‌ర్‌ సంతోష్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’.సుమంత్ మూవీ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, కీల‌క పాత్ర‌ధారి ప్ర‌కాష్ రాజ్ ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అయిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌స‌న నాయిక‌లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు.’అల్లుడు అదుర్స్’ టైటిల్‌కూ, ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కూ అన్ని వైపుల నుంచీ అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింద‌ని నిర్మాత తెలిపారు. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తామ‌నీ, 2021 సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ ఆయ‌న చెప్పారు.

ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్‌, వెన్నెల కిశోర్‌

సాంకేతిక బృందం:
సంగీతం: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
యాక్ష‌న్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్
స‌మ‌ర్ప‌ణ‌: ర‌మేష్‌కుమార్ గంజి
నిర్మాత‌: సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌
ద‌ర్శ‌క‌త్వం: స‌ంతోష్ శ్రీ‌నివాస్‌