కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని..కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ఏమి చేయని ఎంపీ బండి సంజయ్.. రాష్ట్రానికి ఏమి చేస్తారు? అంటూ ప్రశ్నించారు.. దమ్ముంటే ప్రధాని మోడీతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు.
కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి సరికాదని హితవుపలికిన తలసాని…. జీఎస్టీ, వ్యవసాయ బిల్లు అంశాలపై కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తామన్నారు.
కరోనా సమయంలో 20 లక్షల కోట్లు అన్నారు… ఎక్కడ ఇచ్చారో..? ఎవరికి ఇచ్చారో మరి..? అంటూ ఎద్దేవా చేశారు. స్వరాష్ట్రంలో రైతులు సగర్వంగా జీవిస్తున్నారని తెలిపిన తలసాని…టీఆర్ఎస్‌ది ప్రజా ప్రభుత్వం అన్నారు.