రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు

231
Heavy rains in telangana
- Advertisement -

తూర్పు-పశ్చిమ shear zone Lat.16.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 km నుండి 7.6 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో రేపు(సెప్టెంబరు 20 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల మరియు రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు మరియు ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -