దేశ వ్యాప్తంగా రైతులు ఉత్పత్తి చేసే మరిన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేయాలన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. నిత్యావసర వస్తు చట్ట సవరణ బిల్లు పై లోక్ సభలో మాట్లాడిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి…..తెలంగాణ రాష్ట్రం రైతులు ఉత్పత్తి చేసే దాదాపు అన్ని పంటలను క్షేత్రస్థాయిలో కొనుగోలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు అనే గొప్ప పథకాన్ని ప్రారంభించారు.రెండు దఫాలుగా రైతులకు పంట పెట్టుబడి కింద 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం..రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.
పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని….బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చింది.కానీ ఇప్పుడు సుగంధ ద్రవ్యాల బోర్డ్ డివిజనల్ ఆఫీసుని అప్ గ్రేడ్ చేసింది.హామీ ఇచ్చినట్లుగా పసుపు బోర్డ్ ను మాత్రం ఏర్పాటు చేయలేదు.తక్షణమే రాష్ట్రంలో ప్రత్యేక పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.