సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం కేసీఆర్

259
cm kcr
- Advertisement -

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్… అర్హ‌త ఉన్న వారికి క‌చ్చితంగా ఉద్యోగం ఇస్తాం అన్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు ఇన్‌కం ట్యాక్స్ ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని మోదీని అనేక‌సార్లు కోరామ‌ని తెలిపిన సీఎం….. కేంద్రం పట్టించుకోలేదన్నారు. రిటైర్ అయిన సింగ‌రేణి కార్మికుల‌ను గౌర‌వించాలి…. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌర‌వంగా పంపాలి అని సీఎం సూచించారు.

కారుణ్య నియామ‌కాలు వీలైనంత త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చూస్తామ‌ని……చ‌దువుకు స‌మాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ అయిన‌ప్పుడు నియ‌మిస్తాం అన్నారు. సంస్థ మంచి, చెడులు వారికి తెలియాలి. ఈ క్ర‌మంలో వారిని త‌క్ష‌ణ‌మే జ‌న‌ర‌ల్ మ‌జ్దూర్ గా తీసుకుంటాం. కొద్ది రోజులు వారికి శిక్ష‌ణ ఇచ్చి అప్‌గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -