మత్స్యకారులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి..

196
minister talasani
- Advertisement -

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ నిరంతరంగా కొనసాగిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ దేనని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో,సింగోటం శ్రీవారిసముద్రం రిజర్వాయర్‌లో మరియు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులలో ఎమ్మేల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేప పిల్లలను వదిలారు.

మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నదని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందని మంత్రులు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చారన్నారని.. ప్రమాదవశాత్తు మత్స్యకారులు మృతి చెందితే రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దళారులకు చేపలను ఇచ్చి మోసపోవద్దన్నారు. వలలు, టీవీఎస్‌ వాహనాలు, చేపలు తీసుకెళ్లేందుకు వాహనాలను సబ్సిడీపై ఇస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిదులు,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -