కొత్తగా తీసుకువచ్చే రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలోని భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో వివరణ ఇచ్చిన సీఎం….9 శాతం సమస్యలకు సర్వేనే పరిష్కారం చెబుతుందన్నారు.
గత పాలకులు అనేక సమస్యలను సృష్టించి పోయారు…భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో అవలంభించిన భూ విధానం అశాస్ర్తీయంగా ఉందన్నారు. గతంలో ఎన్నికలు వచ్చాయంటే పట్టాలు ఇచ్చే వారు….. స్థలాలు చూపకుండానే పట్టాలు పంపిణీ చేశారని గుర్తుచేశారు సీఎం.
పంచిన భూమి తక్కువ.. పంపిణీ కాగితాలే ఎక్కువ అని సభ దృష్టికి తీసుకొచ్చిన సీఎం … సమస్యల పరిష్కారంతో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుందన్నారు. అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం కావాలంటే కాదు.. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నాం అన్నారు.