గెలుపు నాదే..విన్నర్‌ టీజర్‌

212
Winner
- Advertisement -

పిల్లానువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌..ఈసారి విన్నర్ సినిమాతో రాబోతున్నాడు. మెగా అభిమానులకు సంక్రాంతి కానుకగా విన్నర్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. ఛాలెంజింగ్ లాంటి కథ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ఉంది. ముఖ్యంగా ఇందులో సాయిధరమ్ తేజ్ చెప్పిన ‘నీలాంటోడు అడుగడుగునా ఉంటాడు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు’ అనే డైలాగ్‌తో పాటు ‘అదే డేట్.. అదే టైమ్.. అదే ప్లేస్.. అదే ట్రాక్.. అదే రేస్.. నేను రెడీ’ అనే డైలాగ్ మెగా అభిమానులను అలరిస్తోంది.

winner
సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయికగా నటించింది. సినిమాకు రకుల్ అందాలు మరో హైలెట్ నిలిచే అవకాశం ఉంది. ఇందులో ఐటంసాంగ్ చేస్తున్న అనసూయ కూడా మరో స్సెషల్ అట్రాక్షన్ అని చెప్పోచ్చు. టీజర్‌లో అనసూయ కూడా హాట్ హాట్‌ గా దర్శనమిచ్చింది. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లో జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించారు. మొత్తానికి గెలుపు నాదే అంటూ ఈ సమ్మర్‌కు విన్నర్‌గా రాబోతున్నాడు సాయిధరమ్ తేజ్‌. మరి సాయిధరమ్‌ ఎందులో ‘విన్నర్‌’ అయ్యాడో తెలియాంటే చిత్రం విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -